ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వివరాలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు దాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.

బాన్సువాడలో 94 శాతం, జుక్కల్‌లో 80 శాతం దాన్యం కొనుగోలు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో దాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి బాన్సువాడ, జుక్కల్‌ ప్రాంతాల నుంచి కాంటాలను, హమాలీలను, లారీలను తెప్పించాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలన్నారు.

తూకం వేసిన ధాన్యం ను వెంటనే రైస్‌ మిల్‌కు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్టాక్‌ జీరో చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ చేసి రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని తూకం, తేమశాతం చూసే యంత్రాలు, గోని సంచులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న దాన్యం వివరాలు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసేలా చూడాలని కోరారు. దాన్యం రవాణాకు సరిపడా వాహనాలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలని కోరారు.

జుక్కల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హనుమంత్‌ షిండే, సురేందర్‌ దాన్యం కొనుగోలులో సమస్యలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఇన్‌చార్జి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, ఆర్‌డివోలు శీను, రాజాగౌడ్‌, జిల్లా సహకార అధికారిని వసంత, జిల్లా రవాణా అధికారిని వాణి, తహసీల్దార్లు, కొనుగోలు కేంద్రాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Check Also

వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాపారాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »