వేల్పూర్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లక్కొర గ్రామంలో ఎస్‌ఐ భరత్ రెడ్డి సీసీ కెమెరాల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరగవని, గ్రామంలో జరుగుతున్న దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు రికార్డ్ అయి ఉంటాయని, సిసి కెమెరాల వల్ల కలిగే లాభాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.