కామారెడ్డి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ ఇండస్ట్రీస్, క్యాసంపల్లిలోని ఓం శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రైస్ మిల్లను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. రైస్ మిల్లులో ధాన్యం నిల్వ చేయడానికి ఖాళీ స్థలం వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తక్షణమే అన్లోడిరగ్ చేసుకోవాలని సూచించారు. సోమవారం నుంచి రైస్ మిల్ యజమానులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.