కామారెడ్డి, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో సోమవారం గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతు పనులపై సమీక్ష నిర్వహించారు.
నాగిరెడ్డిపేటలో గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ చేయడానికి తేదీని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డిలో గురుకుల పాఠశాల భవనం పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రారంభ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో గురుకుల రీజినల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్, డిఈ అంజన్ రావు, ఏఈ సంపత్, అధికారులు పాల్గొన్నారు.