కామారెడ్డి, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపల్లి శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు తమకు నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. 45 రోజుల్లో మరోచోట అదే సర్వే నెంబర్లో భూములు ఇప్పిస్తామని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శీను, తహసీల్దార్ వెంకట్ రావు, అధికారులు ఉన్నారు.