నిజామాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి.యస్.ఆర్.టి.సి. వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ ఆదేశానుసారము కోవిడ్ నియమాలు పాటిస్తూ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిభిరం ఈనెల 30 మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిజామాబాదు-1 డిపో నందు నిర్వహించబడుతుందని ప్రాంతీయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
కావున ఆర్టీసి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ కళాశాల విద్యార్థులు, 18 సంవత్సరాల వయస్సు నుండి 60 సంవత్సరాల మధ్య గల ఏ ఆరోగ్యకరమైన వ్యక్తి అయినా స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదానం చేయాలని అన్నారు.
మీరు రక్త దానం చేసినప్పుడు, అది రోగికి మాత్రమే కాదు, వారిపై ఆధారపడిన వారందరిపై ప్రభావం చూపుతుందని, తద్వారా మొత్తం సమాజం లాభం పొందుతుందని యన్. సుధా పరిమళ, నిజామాబాద్ రీజినల్ మేనేజర్ తెలిపారు.