ఎన్నికల కోడ్‌ ముగిసింది… పనులపై దృష్టి పెట్టండి

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినందున కొనసాగుతున్న పనులపై, ప్రాధాన్యత పనులపై శ్రద్ధ చూపాలని, కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లా అధికారులకు, ప్రజలకు సూచించారు.

సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన పలు అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు, హరితహారం, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, టీఎస్‌ ఐ-పాస్‌ తదితర అంశాలపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున ఎన్నికల కోడ్‌ ముగిసిందని అందువల్ల అన్ని శాఖల జిల్లా అధికారులు యధావిధిగా తమ శాఖల పనులు పూర్తిస్థాయిలో నిర్వహించుటకు శ్రద్ధ చూపాలన్నారు. శాఖలకు సంబంధించిన విషయాలు ఉంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. రెగ్యులర్‌గా పనులు జరగాలన్నారు.

స్కూళ్లు, కళాశాలలు నడుస్తున్నందున డిఈఓ, డిఐఈవో వారి పరిధిలో సిస్టమేటిక్‌గా పని జరిగేలా చూడాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు తొందరగా పూర్తిచేయాలని, రైతులకు చెల్లింపులు కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. హరితహారానికి వచ్చే సంవత్సరం కోసం ప్లాన్‌ చేసుకోవాలని, నర్సరీలను రెగ్యులర్‌గా మెయింటెన్‌ చేయాలన్నారు.
హరిత హారంలో నాటిన మొక్కలను కాపాడడం చాలా ముఖ్యమన్నారు. పిఆర్‌, ఆర్‌అండ్‌బి రోడ్ల వెంబడి ఏవిన్యూ ప్లాంటేషన్‌ గ్రామ పంచాయతీలు మెయింటెన్‌ చేయాలని మానిటరింగ్‌ ఆ శాఖల అధికారులు చేయాలన్నారు.

నేషనల్‌ హైవే ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్కూళ్లు, కాలేజీలు ఆఫీసులలో ట్రీ గార్డ్స్‌ పడిపోయినవి సరి చేయాలన్నారు. కలుపు మొక్కలు క్లియర్‌ చేయించాలన్నారు. ఏవెన్యూ ప్లాంటేషన్‌ బాగాలేకుంటే పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామన్నారు. టీఎస్‌ ఐపాస్‌లో అనుమతులు ఎప్పటికప్పుడు ఇవ్వాలన్నారు.

కోవిడ్‌ కేసులకు కాంపెన్సేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని, సరైన పద్ధతిలో దానిని అందించడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కొత్త వేరియంట్‌ ఓమై క్రాన్‌తో చాలా దేశాలు ఇబ్బందిపడుతున్నాయని, దక్షిణాఫ్రికాలో వచ్చిన కొత్తరకం వేరియంట్‌ చాలా డేంజరస్‌గా ఇన్‌ఫెక్షన్‌ రేట్‌ స్ట్రాంగ్‌గా ఉందని వార్తలు వస్తున్నాయని, ఈ పరిస్థితులలో థర్డ్‌ వేవ్‌ వచ్చినా రావచ్చని, ఇప్పటికే సౌత్‌ ఆఫ్రికా, సింగపూర్‌ లాక్‌డౌన్‌ వైపు వెళ్తున్నాయని, కొత్త వేరియంట్‌తో డెత్‌ రేటు కూడా ఎక్కువగా ఉండవచ్చని కావున యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజలు కూడా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కులు ధరించాలని ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోకుంటే తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రతి శాఖలో పని చేసేవారు, విద్యాశాఖలో 18 ప్లస్‌ ఉన్న విద్యార్థులు కూడా తీసుకోవాలని, అందరికీ అవగాహన కల్పించాలని వేరే మార్గము లేదన్నారు. అనంతరం చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీస్‌ ప్రచురించిన జిల్లా హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ను ఆవిష్కరించారు. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత హ్యాండ్‌ బుక్‌ మొట్టమొదటిసారి ప్రచురించడం జరిగిందన్నారు. 2019 -20 సంవత్సరానికి సంబంధించిన నిజామాబాద్‌ జిల్లా యొక్క అన్ని శాఖల సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా, జెడ్‌పి సీఈవో గోవింద్‌, డిపిఓ జయసుధ, సిపిఓ శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »