కామారెడ్డి, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ఎంపిపి దశరథ రెడ్డి తన రోజువారీ పర్యటనలో భాగముగా తన మండల పరిధిలోని మద్దికుంట ఫారెస్ట్ పరిధిలో గల నర్సరీ నీ తనిఖీచేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు.
ముఖ్య మంత్రి కేసిఆర్ చెప్పినట్లు కోతులు అడవిలో ఉండాల్సినవి పట్టణాలలో గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాటికీ పరిష్కారం అడవిలో పండ్ల చెట్లు పెంచాలని తెలిపిన విషయం మన అందరికి తెలిసిందే అని, అందుకని జామ, అల్లనేరేడు, మామిడి, చీమ చింత, మొర్రి, దానిమ్మ, సీతఫలం, నేరేడు లాంటి మొక్కలు పెంచాలని ఇలాంటివి అడవిలో విరివిగా లభించితే కోతులు వాటికీ అవే అడవిలోకి తిరుగు ప్రయాణం చేస్తాయని తెలిపారు.
దీనికి సంబంధిత అటవీ అధికారి సంతోషం వ్యక్తం చేశారు. అలాంటి వాటిని పెంచుతామని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ఎంపిపి తెలిపారు.