హైదరాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కొవిడ్ కలకలంపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, గురుకుల, హాస్టల్ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లోని సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకోవాలని, కొన్నిచోట్ల యజమాన్యాల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ మిషన్లు తప్పక వాడాలని మంత్రి సబిత సూచించారు.