నిజామాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 2021-23 సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపులో బాగంగా ఇటీవల డ్రా వాయిదా పడిన (03) దుకాణాలకు సోమవారంతో 29వ తేదీ దరఖాస్తు గడువు ముగిసిందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర తెలిపారు.
కాగా మంగళవారం 30వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిచే లక్కీ డ్రా తీయబడుతుందని, లక్కీ డ్రా లో షాప్ దక్కించుకున్న లైసెన్స్ దారుడు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ లైసెన్స్ టాక్సును వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, అలాగే 1వ తేదీ డిసెంబర్ 2021 నుండి షాపును నడపవలెనన్నారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ప్రగతిభవన్‌లో దరఖాస్తు దారులు హాజరుకావాలని సూచించారు.