కామారెడ్డి, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ఎంపిపి దశరథ రెడ్డి తన పర్యటనలో భాగంగా సోమవారం రామారెడ్డి ఎస్‌సి హాస్టల్‌లో విద్యార్థుల సాదక బాదకాలు అడిగి తెలుసుకున్నారు. విద్య విషయాలు, కనీస అవసరాలు విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు.

అలాగే మధ్యాహ్న బోజనం పరిశీలించారు. పాలు సరిగా కొలతల ప్రకారం అందించాలని పౌష్టిక ఆహారం అందిచడంలో అలసత్వం చేయరాదని సిబ్బందికి సూచించారు. ఎంపిపి తమ హాస్టల్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
తాము బాగా చదువుకొని మీలాంటి పెద్దలకు రుణపడి ఉంటామని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి రవీందర్ రావు, తెరాస మాజీ కార్యదర్శి ల్యగల మహిపాల్, టౌన్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.