బాల్కొండ, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామ శివారులో బడి బయట పిల్లలను సోమవారం మండల విద్యాధికారి రాజేశ్వర్ గుర్తించారు. సుమారు 40 మందిని ఇటుక బట్టీలవద్ద వద్ద పని చేస్తున్న కార్మికుల పిల్లలు, కొంత మంది పిల్లలు కూడా పని చేస్తున్నారనీ తెలుసుకొని వారిని స్థానిక బస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు.
అలాగే ముప్కాల్ ఇటుక బట్టీలవద్ద మరో 9 మంది బడి బయట పిల్లలను గర్తించారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, విద్యార్థులకు పనిచేసే చోటనే ఉపాధ్యాయులను నియమించి ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు మండల విద్యాధికారి రాజేశ్వర్ తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారాం, ఉపాధ్యాయులు పిల్లి రాజేశ్వర్, సిఆర్‌పిలు సుమలత, తధితరులు పాల్గొన్నారు. నెల్లూరు, మహారాష్ట్ర తధితర ప్రాంతాల నుండి వలస వచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లోనున్న పిల్లలకు విద్యావకాశాలు అందించుటకై ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు చేయబడ్డాయని, ఇటువంటి పిల్లలను నేరుగా రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించితే సర్దుబాటు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పిల్లలను కొంతకాలం ట్రాన్సిట్ హోంలో ఉంచి, వాలంటీర్ల ద్వారా కొద్ది రోజుల పాటు కౌన్సిలింగ్ ఇప్పించి తదుపరి రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుందన్నారు.
బడిబయటి పిల్లలకు విద్యావకాశాలు
ఉచిత నిర్భంధ విద్యా హక్కు చట్టం 2009 అమలులో భాగంగా బడిబయటి పిల్లలందరినీ వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్చవలసి ఉంటుందని, చేరిన తరగతి స్ధాయికి చెందిన అభ్యసన స్ధాయిలను విద్యార్ధులకు అందించుటకు ఎన్‌ఆర్‌ఎస్‌టిసిలు, ఆర్‌ఎస్‌టిసిలు ఏర్పాటు చేస్తారన్నారు. అలాగే తల్లిదండ్రులతో పాటు వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన పిల్లలకు విద్యను అందించుటకు పెద్దలు పనిచేస్తున్న ప్రాంతంలోనే వర్క్‌సైట్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు.