నిజామాబాద్, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో పెండిరగ్లో ఉంచిన మూడు మద్యం దుకాణాలకు మంగళవారం లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.
ఈనెల 20న లక్కీ డ్రా ద్వారా జిల్లాలో 102 మద్యం దుకాణాలను ఎంపిక చేయాల్సి ఉండగా 99 ని ఎంపిక చేసి దరఖాస్తులు సంతృప్తికరంగా రాని 8, 36, 99 నంబరు గల షాపులను పెండిరగ్లో ఉంచిన సంగతి తెలిసిందే.
వాటికి తిరిగి దరఖాస్తులు స్వీకరించి మంగళవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.