ఆర్మూర్, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్‌ల వ్యాట్ తగ్గించనందుకు నిరసనగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తావద్ద గల భారత్ పెట్రోల్ బంక్ నుండి జాతీయ జెండా, క్లాక్ టవర్ ముందున్న ఇండియన్ పెట్రోల్ బంక్ వరకు ట్రాక్టర్‌ను తాడుతో లాగి వెంటనే పెట్రోల్, డీజిల్‌ల వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ కుమార్, బిజెపి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, బిజెపి ఆర్మూర్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోన కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గ్రహించి పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా వ్యాట్ తగ్గించుకోవాల్సిందిగా కోరారని, ప్రధానమంత్రి మోడీ పిలుపును అందుకున్న దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలకతీతంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ, కమ్యూనిస్టు రాష్ట్రంలో కానీ పెట్రోల్, డీజిల్ ధరల వ్యాట్ తగ్గించి ప్రజలకు సౌకర్యం కల్పిస్తా ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల యొక్క ఇబ్బందులను పట్టించుకోకుండా బీజేపీపై అక్కసుతో పెట్రోల్, డీజిల్ ల వ్యాట్ తగ్గించకుండా, దొంగే – దొంగ దొంగ అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు.
ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని రాబోయే కాలంలో తెలంగాణ నుండి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు ఇంకా ఎన్నో రోజులు లేవని, ఈ యొక్క కుటుంబ పాలనకు, రజాకార్ల పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందని, ఇప్పటికైనా తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మేలుకోని ప్రజల సౌకర్యార్థం, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే పెట్రోల్, డీజిల్ యొక్క వ్యాట్ తగ్గించి ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గి విజయ్, దళిత మోర్చా పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం, బిజెపి నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, బిజెపి ఆర్మూర్ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, ద్యాగ ఉదయ్, బిజెపి ఆర్మూరు మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు భూసం ప్రతాప్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి బిజెపి, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.