Monthly Archives: November 2021

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి…

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్య వివాహాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా బాలల రక్షణ యూనిట్‌ జిల్లా లెవెల్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే 1098 నెంబర్‌ సమాచారం ఇవ్వాలని సూచించారు. అనాధ బాలలకు రక్షణ కల్పించాలని కోరారు. …

Read More »

నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఒక్కరికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ వేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం రాత్రి వైద్య ఆరోగ్య మున్సిపల్‌ అధికారులతో జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్‌ ద్వారా ప్రపంచ …

Read More »

రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ.ఐ.కే.ఎమ్‌.ఎస్‌, ఐ.ఎఫ్‌.టి.యు, పీ.వై.ఎల్‌, పి.ఓ.డబ్ల్యు సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర విద్యుత్‌ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏ.ఐ.కె.ఎమ్‌.ఎస్‌, ఐ.ఎఫ్‌.టి.యు, పీ.వై.ఎల్‌, పీ.ఓ.డబ్ల్యు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి.యస్‌.ఆర్‌.టి.సి. వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి. సజ్జనార్‌ ఆదేశానుసారము కోవిడ్‌ నియమాలు పాటిస్తూ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిభిరం ఈనెల 30 మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిజామాబాదు-1 డిపో నందు నిర్వహించబడుతుందని ప్రాంతీయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆర్టీసి ఉద్యోగులు, వారి …

Read More »

హాస్టల్‌ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి…

హైదరాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కొవిడ్‌ కలకలంపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, గురుకుల, హాస్టల్‌ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లోని సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల …

Read More »

ధాన్యం కొనుగోళ్లలో రైస్‌ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి

బోధన్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం కొనసాగిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు 4, 5 కిలోలు కావాలని రైస్‌ మిల్లు యజమానులు బెదిరించడం మానుకోవాలని యాసంగిలో వరి కొనుగోలు చేయుటకు గురించి ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన ప్రత్యామ్నాయ పంటల సాగు చేయుట గురించి సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఆర్‌.డి.ఓ కార్యాలయం ముందు సిపిఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ, ఐ.ఎఫ్‌.టీ.యూ, ఏ.ఐ.కే.ఎం.ఎస్‌, …

Read More »

ఎన్నికల కోడ్‌ ముగిసింది… పనులపై దృష్టి పెట్టండి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినందున కొనసాగుతున్న పనులపై, ప్రాధాన్యత పనులపై శ్రద్ధ చూపాలని, కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లా అధికారులకు, ప్రజలకు సూచించారు. సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన పలు అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు, హరితహారం, …

Read More »

బడి బయట పిల్లలను గుర్తించిన మండల విద్యాధికారి

బాల్కొండ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం బస్సాపూర్‌ గ్రామ శివారులో బడి బయట పిల్లలను సోమవారం మండల విద్యాధికారి రాజేశ్వర్‌ గుర్తించారు. సుమారు 40 మందిని ఇటుక బట్టీలవద్ద వద్ద పని చేస్తున్న కార్మికుల పిల్లలు, కొంత మంది పిల్లలు కూడా పని చేస్తున్నారనీ తెలుసుకొని వారిని స్థానిక బస్సాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. అలాగే ముప్కాల్‌ ఇటుక బట్టీలవద్ద మరో 9 …

Read More »

3 వైన్‌షాపులకు దరఖాస్తులకు సోమవారం చివరి గడువు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 2021-23 సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపులో బాగంగా ఇటీవల డ్రా వాయిదా పడిన 3 దుకాణాలకు అప్లికేషన్లు చేసుకోవడానికి చివరి తేదీ 29 సోమవారం వరకు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం గెజిట్‌.నెం.008 షాప్‌కు 01 అప్లికేషన్స్‌, గెజిట్‌.నెం.036 షాప్‌కు …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇన్‌చార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »