Monthly Archives: November 2021

సిసి కెమెరాలతో అనేక విషయాలు రికార్డు అవుతాయి…

వేల్పూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం లక్కొర గ్రామంలో ఎస్‌ఐ భరత్‌ రెడ్డి సీసీ కెమెరాల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరగవని, గ్రామంలో జరుగుతున్న దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు రికార్డ్‌ అయి ఉంటాయని, సిసి కెమెరాల వల్ల కలిగే లాభాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

వరి ధాన్యం పరిశీలించిన బిజెపి నాయకులు

వేల్పూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని పడగల గ్రామంలో వరి ధాన్యాన్ని బాల్కొండ బిజెపి పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్‌ రాజేశ్వర్‌తో, మండల స్థాయి నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా రాజేశ్వర్‌ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని హుజురాబాద్‌ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడం పట్ల సీఎం కెసిఆర్‌ …

Read More »

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌ నగర్‌లో గల బ్రిలియంట్‌ స్కూల్‌ లో న్యాయవాది పరిషత్‌ ఆధ్వర్యంలో భారత రాజంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది పరిషత్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ్‌ కుమార్‌ సుబెదార్‌ రాజ్యాంగం ప్రతి ఒక్కరూ గౌరవించాలని, దేశ స్థితిగతులను అధ్యయనం చేసి భవిష్యత్‌ తరాలకు అవసరమైన దూరదృష్టితో రాజ్యాంగాన్ని రచించడం …

Read More »

చివరి దశకు ధాన్యం సేకరణ – కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం సేకరణ 80 శాతం పైగా దాటినందున మరో రెండు రోజుల్లో మిగతా ప్రక్రియను పూర్తి చేసి రైతులకు బిల్లులు చెల్లించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని, కడ్తా అడగని మిల్లులకే ధాన్యాన్ని పంపించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుండి ఆయన ధాన్యం సేకరణ సంబంధించిన అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా …

Read More »

రైతులు పండిరచిన వడ్లతో రాజకీయం

గాంధారి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం రైతులు పండిరచిన వడ్లతో రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటుందని టీజెఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు రక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ నిల్వ ఉన్న వరి …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ఆధ్వర్యంలో నగరంలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో రాజ్యాంగం పైన అవగాహన సదస్సు, రాజ్యాంగ అంశాల పైన క్విజ్‌ పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ వేదశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగ హక్కులు, విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా భవిష్యత్‌ తరాలకు రాజ్యాంగ …

Read More »

చిట్టాపూర్‌ ఉన్నత పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

బాల్కొండ, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనకు స్వాతంత్య్ర దినోత్సవం తెలుసు… గణతంత్ర దినోత్సవం తెలుసు… మరి రాజ్యాంగ దినోత్సవం ఏంటి.. ఎందుకు జరుపుతారో తెలుసుకుందామనీ విద్యార్థులనుద్దేశించి బాల్కొండ మండల విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌ అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌ 26న మనదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోందని, దీన్నే సంవిధాన్‌ దివస్‌ అని కూడా అంటారన్నారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారని, 1949 …

Read More »

అక్రమ టీచింగ్‌ పోస్టులు రద్దు చేయాల్సిందే

డిచ్‌పల్లి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తాకి పి.డి.ఎస్‌.యు, పీ.వై.ఎల్‌ నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్‌ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశాలకు చివరి గడువు

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెగ్యులర్‌ డిగ్రీలో సీటు రాని వారికి చక్కని అవకాశం… అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చదువుకునే అవకాశం కల్పిస్తుంది. దీనికి ఇంటర్‌, పాలిటెక్నిక్‌ కోర్సు చదివిన వారు అర్హులు. ప్రవేశాల కొరకు డిసెంబర్‌ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

ధృవీకరణ పత్రం అందజేసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర సమక్షంలో జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నారాయణ రెడ్డి శుక్రవారం అందజేశారు. రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఇతర శాసనసభ్యులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »