కామారెడ్డి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఓటర్ నమోదు కార్యక్రమం గరుడ యాప్ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా శశాంక్ గోయల్ …
Read More »Daily Archives: December 1, 2021
అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి…
కామారెడ్డి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా రెవిన్యూ, అటవీ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అర్హత గల లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. …
Read More »ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలి
కామారెడ్డి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌ను అరికట్టడంలో ప్రతి ఒక్కరు …
Read More »వందశాతం రెండు విడతల వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ చివరికల్లా రాష్ట్రంలో రెండు విడుదల వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేయడంతోపాటు ఓమైక్రాన్ గురించి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖామాత్యులు టి హరీష్ రావు కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, ప్రపంచవ్యాప్తంగా …
Read More »ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి (డిఐఇవో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం …
Read More »వసతి గృహాన్ని తనిఖీ చేసిన చీఫ్ వార్డెన్
డిచ్‌పల్లి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ మెయిన్ క్యాంపస్ బాలికల వసతి గృహంను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖవి తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. థర్డ్ వేర్ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ముఖానికి మాస్కు మరియు శానిటైజర్ దగ్గర ఉంచుకోవాలని, మీ రూమ్‌లో …
Read More »చేతులెత్తి దండం పెడుతున్నా, దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదం పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు తెలియజేస్తున్నాయని అది ఇంతకు ముందటి 1, 2 విడతల వైరస్ కంటే కూడా ఎన్నో రెట్లు ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారని దీని నుండి బయటపడాలంటే వ్యాక్సిన్ ఒకటే మన ప్రాణాలను కాపాడుతుందని అందువల్ల ఇంకా వ్యాక్సిన్ తీసుకోని లక్షన్నర మంది వెంటనే …
Read More »పరీక్షల షెడ్యూల్ విడుదల
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదలైందని ప్రాంతీయ అధ్యయన కేంద్ర రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఓల్డ్ బ్యాచ్ 2021 డిసెంబర్ 28 నుంచి 2022 జనవరి 17 వరకు… పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2021 డిసెంబర్ 2, రూ.500 అధిక రుసుముతో …
Read More »ఖానాపూర్‌లో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన
ఆర్మూర్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో బుధవారం గ్రామాభివృద్ది కమిటీ, గ్రామ ప్రజలు అధ్వర్యంలో గ్రామ దేవతల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం నుండి పూజలు హోమం మూడు రోజుల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే విదంగా బుధవారం చివరి రోజు కావున గ్రామంలో దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఇంతకు ముందు ఈ …
Read More »రైతుల కోసం పార్లమెంటులో నిరసనలు
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జై తెలంగాణ నినాదాలు లోక్‌సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్‌సభలో ఆందోళనను చేపట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన తెలియజేసి వెల్ లోకి దూసుకెల్లారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్‌ఎస్ ఎంపీలు వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం …
Read More »