కామారెడ్డి, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఓటర్ నమోదు కార్యక్రమం గరుడ యాప్ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుంచి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు.
డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న డిగ్రీ కళాశాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ రూపొందించిందని దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు.
గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈవీఎం గోదాములను ప్రతిమాసం తనిఖీ చేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మాట్లాడారు. సమస్త ఓటరు నమోదు అధికారులు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ గడువు తేది ముగిసినందున ఓటర్ల జాబితాలను త్వరితగతిన సిద్ధం చేయాలని తెలిపారు. ఇంకా పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను బిఎల్‌వోల సహాయంతో పరిశీలించి జాబితాల సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఆర్‌డిఓ శీను, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.