కామారెడ్డి, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్నిపురస్కరించుకుని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ఆధ్వర్యంలో కరోనా సమయంలో రక్తదానం, ప్లాస్మాదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలను, మెమొంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, వ్యక్తిగతంగా 64 సార్లు, కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను, 958 యూనిట్ల రక్తాన్ని సేకరించి, ఇప్పటివరకు 9520 పైగా యూనిట్ల రక్తాన్ని 100 పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన నిర్వాహకుడు బాలును కలెక్టర్ అభినందించాడు.
రక్తదానంలో, ప్లాస్మాదానము చేసినదాతలకు కరోణ వారియర్స్ అవార్డును 42 మందికి అందజేశారు. కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు డాక్టర్ వేద ప్రకాష్, కుంభాల లక్ష్మణ్ యాదవ్, మహేష్ గుప్తా, శ్రీధర్, కిరణ్, గంప ప్రసాద్, శ్యామ్ గోపాల్, శ్రీనివాస్, సురేష్, సాయి ఆంజనేయులు, నరేందర్ గౌడ్, రవి, తదితరులున్నారు.