నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జై తెలంగాణ నినాదాలు లోక్‌సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్‌సభలో ఆందోళనను చేపట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన తెలియజేసి వెల్ లోకి దూసుకెల్లారు.
తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్‌ఎస్ ఎంపీలు వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో వెల్‌లోకి దూసుకువెళ్లిన టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. కనీస మద్దతు ధర కోసం వెంటనే బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.