నిజామాబాద్, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎస్‌ఆర్ కార్యక్రమాల ద్వారా అందిన అన్ని ఓటరు నమోదు దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుండి ఓటర్ నమోదుకు సంబంధించి స్పెషల్ సమ్మర్ రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినందున గరుడ యాప్‌లో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఎలక్ట్రో రోల్ గురించి నియోజకవర్గం వారీగా అవగాహన కల్పించాలని వచ్చిన దరఖాస్తులు క్లియర్ చేయాలని తెలిపారు.
అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డి ఈఆర్‌వోలతో మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు పెండిరగులో ఉండరాదని టార్గెట్ మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రతి దరఖాస్తు వెంటనే ఆన్‌లైన్ చేయాలని స్మార్ట్ ఫోన్ ఉన్న బిఎల్‌వోలు గరుడ యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఆర్‌డివోలు మానిటరింగ్ చేయాలన్నారు. ఆఫ్లైన్ దరఖాస్తులను ఫీల్డ్‌లో వెరిఫికేషన్ చేయాలన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ వివరాల నమోదు మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, జడ్పీ సీఈఓ గోవింద్, డిఆర్‌డిఓ చందర్ నాయక్, ఆర్డీవోలు రవి, శ్రీనివాస్, రాజేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.