బోరు మోటారు ప్రారంభించిన ఎంపిపి

కామారెడ్డి, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం స్కూల్‌ తాండ గ్రామంలో, జగదాంబ తండా గ్రామాలలో బోరు మోటర్‌ను ఎంపీపీ దశరథ రెడ్డి ప్రారంభించారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నదని ఇరు గ్రామాల ప్రజల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు స్థానిక ఎంపిటిసి సంత్యఅలి చంద్రునాయక్‌, ఎంపిపి దశరథ రెడ్డి నిధుల నుండి రెండు గ్రామాల దాహర్తిని తీర్చాలని బోర్‌ మోటార్‌ వేస్తున్నామని తెలిపారు.

నీటి ఇబ్బందులు తొలగించినందుకు రెండు గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్‌ తాండ సర్పంచ్‌ లలిత బుచ్చి రెడ్డి, జగదాంబ తండా సర్పంచ్‌ రాజు నాయక్‌, రెడ్డిపేట్‌ ఎంపిటిసి రాజా గౌడ్‌, తెరాస మండల ప్రధాన కార్యదర్శి బుచ్చి రెడ్డి, మండల తెరాస నాయకులు రాజేందర్‌ గౌడ్‌, పడిగెల శ్రీనివాస్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »