నిజామాబాద్, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరు రాంనగర్‌లో సెల్ టవర్ నిర్మాణం ఆపాలని సెల్ టవర్‌కి పర్మిషన్ ఇవ్వద్దని గురువారం ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ ప్రజలు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని ధర్నా చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల నివాసాల మధ్య సెల్‌టవర్ నిర్మించడం సరైంది కాదని దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో సెల్ టవర్ నిర్మాణం చేయాలని గతంలో మున్సిపల్ కమిషనర్‌కి, ఆర్డిఓకు తెలియజేయడం జరిగిందన్నారు. అయినా సెల్ టవర్ యజమాని తాను సెల్ టవర్ నిర్మిస్తానని ఎవరికీ చెప్పకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
సెల్ టవర్ నిర్మాణం వల్ల గర్భిణీలకు, చిన్న పిల్లలకు చాలా ప్రమాదకరమని సెల్ టవర్ నిర్మాణం ఆపేయాలని కాలనీ ప్రజలు కోరడంతో గురువారం కలెక్టర్‌ను కలిసి విన్నవించడం జరిగిందని సెల్ టవర్ ఆపని ఎడల ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బొట్ల రాజు, అబ్దుల్, మోహిని, బ్రహ్మానందం, మున్నాభాయ్, తదితరులు పాల్గొన్నారు.