కామారెడ్డి, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యవసర పరిస్థితిలో కామారెడ్డిలోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గాంధారి మండలానికి చెందిన మహిళకి చికిత్స నిమిత్తం బి.నెగెటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్, కొత్మీర్ కార్ రామకృష్ణ లను సంప్రదించారు.
దీంతో జిల్లా కేంద్రానికి చెందిన వడ్ల సురేష్ సహకారంతో అత్యల్పంగా లభించే బి. నెగెటివ్ రక్తం అందజేశారు. ఈ సందర్భంగా రక్తదాతల నిర్వహకులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్నవారికి మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం, స్ఫూర్తిదాయకమని రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు.
కార్యక్రమంలో వి.టి. ఠాకుర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.