డిచ్‌పల్లి, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీలో 2014 లో నియమితులైన రెగ్యులర్ అధ్యాపకులు వారికి పదోన్నతులు కల్పించక పోవడంపట్ల గురువారం ధర్నా నిర్వహించారు. 2014 లో నియమితులైన అధ్యాపకుల అధ్యక్షుడు డా. బాలకిషన్, కార్యదర్శి డా. లక్ష్మణ్ చక్రవర్తి మాట్లాడుతూ తమకు వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించాలని లేనిచో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రో. రవీందర్, రిజిస్టర్ ప్రో. యాదగిరిలకు వినతి పత్రం అందజేశారు.
అధ్యాపకులు తమ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్‌లకు, అకాడమిక్ పోస్ట్‌లకు రాజీనామా తెలుపుతూ రాజీనామా పత్రాలను అధికారులకు ఇచ్చారు. అధికారులు తమకు త్వరలోనే న్యాయం చేస్తామని తెలిపారు. అధ్యాపకులలో డా. ఎ. నాగరాజు, డా. పున్నయ్య, డా. జమీల్ అహ్మద్, డా. మహేందర్, డా. రమణా చారి, డా. ప్రసన్న రాణి, డా. యెల్లోసా, డా. పాత నాగరాజు, డా.వాసం చంద్రశేఖర్, డా. మోహన్ బాబు, డా. అంజయ్య, డా. అబ్దుల్ ఖవి తదితరులు ఉన్నారు.