డిచ్‌పల్లి, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యునివర్సిటీ పరిధిలోని బి.ఇ.డి. కళాశాలల అక్రమ అఫియషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ చాంబర్ వద్ద డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు నినాదాలు చేస్తు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యునివర్సిటి పరిధిలోని బి.ఇ.డి. కళాశాలలలో కనీస వసతులు లేవని, అధ్యాపకులు కూడా లేరని అదే విధంగా భవనాలు లేకున్నా ఎక్కడో ఒక వద్ద కళాశాలలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
కొన్ని కళాశాలలు మైనారిటి పేరు మీద ఉన్నప్పటికి అందులో వారికి అడ్మిషన్లు ఇవ్వకుండా మేనేజ్‌మెంట్ సీట్లు అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించకుండా అక్రమంగా వారికి అప్లియెషనలను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. వైస్‌ఛాన్స్‌లర్ స్పందిస్తూ అఫ్లియషన్లను వెంటనే రద్దు చేస్తున్నామని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తామని తెలిపారు. దీంతో విద్యార్థి నాయకులు శాంతించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ ,పంచరెడ్డి చరణ్, పిల్లి శ్రీకాంత్, లాల్ సింగ్, జైత్రమ్ రాథోడ్, సతీష్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.