వ్యాక్సిన్‌ తీసుకోకుంటే థర్డ్‌ వేవ్‌ ప్రమాదం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ చివరి నాటికి తప్పనిసరి రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు ప్రజలను కోరారు.

గురువారం కరోనా వ్యాక్సినేషన్‌ పై కలెక్టర్‌ జడ్పీ చైర్మన్‌తో కలిసి మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 31 వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం యజ్ఞంలా పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రేపటి నుండి వ్యాక్సినేషన్‌ ఒక డ్రైవ్‌గా నిర్వహించడానికి ప్లాన్‌ చేసుకోవాలని ప్రతి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మొదటి, రెండవ డోసు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని 10 నుండి 15 రోజుల్లో డ్రైవ్‌ నిర్వహించి పూర్తి చేయాలని తెలిపారు.

ఇప్పటివరకు 9 లక్షల 70 వేల మందికి వాక్సిన్‌ ఇవ్వడం జరిగిందని ఎవరికి ఏమి కాలేదని తెలిపారు. వాట్సాప్‌లో వ్యాక్సిన్‌పై వచ్చే అపోహలు, పుకార్లను నమ్మవద్దని వ్యాక్సిన్‌ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కరోనా వచ్చినా మందులతో తగ్గుతుందన్నారు. ఓమిక్రాన్‌ వేరియంట్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందన్నారు.

గ్రామాలలో సర్పంచులు, గ్రామాభివృద్ది కమిటీలు ముందుకు రావాలని, జిపి సెక్రటరీలు, మున్సిపాలిటీల కమిషనర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు తప్పనిసరిగా 18 సంవత్సరాలు దాటిన వారికి మొదటి, రెండవ డోసు ఇప్పించాలని తెలిపారు. 31 డిసెంబర్‌ వరకు 100 శాతం పూర్తి కావాలన్నారు. అందుకు గ్రామ పంచాయతీలకు నాలుగు, మున్సిపాలిటీలకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినందుకు 26 జనవరి రోజు ఫస్ట్‌, సెకండ్‌ అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్‌ ఇద్రిస్‌ ఖాన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ఎల్‌.బి. చిత్రా మిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్‌, డిఆర్‌డిఓ చందర్‌ నాయక్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి శివ శంకర్‌, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »