నిజామాబాద్, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించుటకు కుటుంబ సభ్యులు సంబంధిత వైద్య ధ్రువపత్రంతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కోవిడు బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వము అందిస్తున్న ఎక్స్ గ్రేషియా చెల్లింపులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారీగా దరఖాస్తులను స్వీకరించాలని, ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రము, కోవిడ్ పరీక్షల ధ్రువీకరణ పత్రముతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత పిహెచ్‌సి డాక్టర్ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కోవిడ్ పాజిటివ్ టెస్ట్కు సంబంధించి ఆర్‌టిపిసిఆర్ పరీక్ష, ర్యాపిడ్ టెస్ట్ హెచ్‌ఆర్‌సిటి పరీక్ష 4 అండ్ 4 ఏ పరీక్షల్లో ఏదో ఒకటి తప్పనిసరి అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఫేక్ సర్టిఫికెట్ ఇస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. 724 దరఖాస్తులు వచ్చినవని డిఎంహెచ్‌వో తెలిపారు. వాటిని పరిశీలించాలని తెలిపారు
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎల్.బి.చిత్రా మిశ్రా, డిఎంహెచ్‌ఓ సుదర్శనము, జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.