కామారెడ్డి, డిసెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కెసిఆర్ కుటుంబానికి 5 ఉద్యోగాలు, తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం టిఆర్ఎస్ అసమర్థ పాలనే అని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆత్మహత్యలే మిగిలాయని, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతచారి ఆత్మబలిదానం సందర్భంగా శుక్రవారం హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా కన్వీనర్ కుంభాల లక్ష్మణ్ యాదవ్‌లు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాలు,లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కెసిఆర్‌కు వారి కుటుంబంలోని వారికి ఉద్యోగాలను ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.
కేసీఆర్‌ను తెలంగాణ రాష్ట్రం నుండి తరిమికొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, విద్యార్థులు నిరుద్యోగులు పోరాటబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.