Daily Archives: December 4, 2021

ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే విజయాలు మీ వెంటే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీరు ఎవరికన్నా తక్కువ కాదని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం న్యూ అంబేద్కర్‌ భవనంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ …

Read More »

6న ఛలో కలెక్టరేట్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సోమవారం తలపెట్టే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన అన్నారు. శ‌నివారం ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కాలర్షిప్‌ బకాయిలు నాలుగు …

Read More »

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…

వేల్పూర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విని సంతోషపడి కొంతకాలానికి తమ ఆశలు అడియాశలు అయ్యాయని, ఆవిరి అయ్యాయని తమ కుటుంబాలు వీధిన పడి ఆత్మ హత్యలకు గురయ్యారని రెవెన్యూ వీఆర్‌ఏ సంఘం వేల్పూర్‌ మండల ఉపాధ్యక్షులు టి మహేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్‌ మండల కేంద్రంలో తహసిల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు శాంతియుత …

Read More »

యాసంగి పంటలపై వేల్పూర్‌లో అవగాహన

వేల్పూర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మోతే గ్రామంలో ఎంపిపి, గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన యాసంగి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యాసంగిలో వరి పంటకి బదులుగా మొక్కజొన్న, జొన్న, మినుము,పెసర వంటి పంటలు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు సాగు చేయవలసిందిగా సూచించారు. ఒకే పంట సాగు చేయడం వలన పంటకు వాడే ఎరువుల వలన …

Read More »

నీడనిచ్చే మొక్కలు ఎక్కువగా పెంచాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో నర్సరీని శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. నర్సరీలో నీడనిచ్చే మొక్కలు అధికంగా పెంచాలని సూచించారు. మర్రి, వేప, కానుగ, రవి, మామిడి, మోదుగ వంటి వాటిని పెంచాలని అధికారులను ఆదేశించారు. 10 వేల మొక్కలు గృహాలకు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శి రాజుకు చెప్పారు. పూల, పండ్ల మొక్కలతో …

Read More »

పదోన్నతులు కల్పించాలని నిరసన

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో అధ్యాపకులుగా చేరిన వారికి పదోన్నతులు కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమాలలో భాగంగా శ‌నివారం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజి మండి అడ్మినిస్ట్రేషన్‌ భవనము వరకు బైక్‌ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డా బాలకిషన్‌ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతులు కల్పించకుండా 2014 అధ్యాపకుల పట్ల వివక్షతను చూపుతున్నారన్నారు. …

Read More »

తెలుగులో శమంతకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఎస్‌. శమంతకు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి. బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్‌. శమంత తెలంగాణ సాహిత్యం శ్రామిక జీవన చిత్రణ (2000-2010) అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. …

Read More »

పది వేల కిలోమీటర్ల పాదయాత్ర

ఆర్మూర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసారం డి.ఎస్‌.పి ఆర్మూర్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో స్వరాజ్య పాదయాత్ర 10,000 కి.మీ పోస్టర్‌ ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో ఆవిష్కరించారు. అనంతరం మండల అధ్యక్షులు నితిన్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్‌టీల రాజ్యస్థాపన కై డా. విశారదన్‌ మహారాజ్‌ …

Read More »

ఈవీఎంల గోదాంను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎంలు నిల్వ ఉంచిన గోదాంను శనివారం కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గోదాంకు సీజ్‌ చేసి ఉన్న తాళాలను చూశారు. బందోబస్తు వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

నిజామాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉంది…

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిజామాబాద్‌ జిల్లా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌ ప్రగతి భవన్‌లో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌లో 100 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 80 శాతం ధాన్యం కొనుగోలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »