వేల్పూర్, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విని సంతోషపడి కొంతకాలానికి తమ ఆశలు అడియాశలు అయ్యాయని, ఆవిరి అయ్యాయని తమ కుటుంబాలు వీధిన పడి ఆత్మ హత్యలకు గురయ్యారని రెవెన్యూ వీఆర్‌ఏ సంఘం వేల్పూర్ మండల ఉపాధ్యక్షులు టి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
వేల్పూర్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు టీ మహేష్ మాట్లాడుతూ కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన వారసత్వ ఉద్యోగాలను పే స్కేల్ ఇవ్వాలని వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి పే స్కేలు ఇస్తానని 14 నెలలు గడిచినా ఇప్పటి వరకు పేస్కేల్ చేయడం లేదని వెంటనే అమలు చేయాలని అన్నారు.
బోధన్, మాచారెడ్డి గ్రామాలలో విఆర్‌ఏలు మృతి చెందిన వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు టీసీ రాజన్న, ఉపాధ్యక్షుడు టీ. మహేష్, ప్రధాన కార్యదర్శి నాగభూషణ్, కార్యదర్శి సుమన్, సభ్యులు వనిత, దీప, రజిత, రాకేష్, ఎండీ ఆఫ్రోజ్, బాస బాలు, వీఆర్‌ఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.