ఆర్మూర్, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసారం డి.ఎస్.పి ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్వరాజ్య పాదయాత్ర 10,000 కి.మీ పోస్టర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఆవిష్కరించారు. అనంతరం మండల అధ్యక్షులు నితిన్ మహరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపన కై డా. విశారదన్ మహారాజ్ పదివేల కి.మీ 10,000 కి.మీ స్వరాజ్య పాదయాత్ర 1 జనవరి 2022 కల్వకుర్తి నుండి 33 జిల్లాల మీదుగా 15మార్చ్ 2023 హైదరాబాద్ వరకు చేయనున్నట్లు, అదేవిధంగా 1 జనవరి 2022 కల్వకుర్తిలో జరిగే ప్రారంభ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయగలరని కోరారు.
కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షులు నితిన్ మహారాజ్, ఉపాధ్యక్షులు కాన్షీరాం మహారాజ్, మండల కమిటీ సభ్యులు దిలీప్ మహారాజ్, సంతోష్ మహారాజ్, సురేష్ మహారాజ్, శ్రీను మహారాజ్, అనిల్ మహారాజ్, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.