నిజామాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉంది…

కామారెడ్డి, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిజామాబాద్‌ జిల్లా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌ ప్రగతి భవన్‌లో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌లో 100 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు చెప్పారు. ఎఫ్‌సిఐ, సివిల్‌ సప్లయి అధికారులకు, రైస్‌ మిల్లర్లకు, జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ చొరవతో మిషన్‌ కాకతీయ పథకం, ఎస్సారెస్పీ పునర్జీవనం, కాలేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా ఉన్నాయని చెప్పారు.

నీటి కోసం రందిలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల నీటి విడుదల చేసే తేదీలను ప్రకటించారు. చెరువులల్లో సమృద్ధిగా నీరు ఉందని, వాటిని వృధా చేయవద్దని సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న రైతులు వరి పంట వేసుకోవచ్చునని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను ప్రోత్సహించడానికి సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారని తెలిపారు. నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ విట్టల్‌ రావు, సమావేశంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్‌ వి పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎమ్మెల్సీ విజి గౌడ్‌, ఆర్‌డివోలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »