కామారెడ్డి, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో నర్సరీని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నర్సరీలో నీడనిచ్చే మొక్కలు అధికంగా పెంచాలని సూచించారు. మర్రి, వేప, కానుగ, రవి, మామిడి, మోదుగ వంటి వాటిని పెంచాలని అధికారులను ఆదేశించారు.
10 వేల మొక్కలు గృహాలకు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శి రాజుకు చెప్పారు. పూల, పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు ఈస్రమ్ పథకం కింద బీమా సౌకర్యాన్ని కల్పించాలని పేర్కొన్నారు.
శ్రమశక్తి సంఘాల ద్వారా పనులను గుర్తించి కూలీలకు ఉపాధి కల్పించాలని కోరారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సర్పంచ్ జానకి, జనార్ధన్ , ఉప సర్పంచ్ లక్ష్మీపతి, వార్డు సభ్యులు, ఎంపీడీవో రాజ్ వీర్, అధికారులు ఉన్నారు.