ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే విజయాలు మీ వెంటే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీరు ఎవరికన్నా తక్కువ కాదని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం న్యూ అంబేద్కర్‌ భవనంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ విట్టల్‌ రావుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని రంగాలలో వికలాంగులు ఎవరికి తీసి పోనీ విధంగా రాణిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్‌ మీకు తోడుగా ఉంటారన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో పేద వారికి ఆదుకోవాలని రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్‌ వెయ్యి రూపాయలకు, వికలాంగులకు 1500 రూపాయలకు పెంచామని, ఎవరిపై ఆధారపడకుండా ప్రస్తుతం 3 వేలు రూపాయలు చేయడం జరిగిందన్నారు. భారత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్‌ ఇస్తుందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 8385 పెన్షనర్స్‌ 500 రూపాయలు ఇచ్చేవారని అందుకు సుమారు 42 లక్షలు ఖర్చు చేసేవారన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 18 వేల 470 మంది వికలాంగులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున నిజామాబాద్‌ జిల్లాలో వికలాంగుల పెన్షన్‌లకు అయ్యే ఖర్చు ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అన్నారు. రేపటి నుండి కార్యాలయాలలో సమస్యలపై వచ్చిన వికలాంగుల సమస్యలు మొదట విన్న తర్వాత వేరే వారి సమస్యలు వినాలని, అమలుకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌కు సూచించారు.

దివ్యాంగుల సోదరులను అవమానపరిచిన వారిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేయాలని, వారిపై దర్యాప్తు చేసి వెంటనే అవమాన పరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. 1572 మంది పెన్షన్‌ కొరకు దరఖాస్తు చేసుకున్నారని కరోనా ప్రభావం వల్ల ఆలస్యం జరిగిందని, తొందరలోనే వాళ్లకు పెన్షన్‌ ఇవ్వబడుతుందన్నారు.

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సూచించిన విధంగా ప్రతి కార్యాలయంలో వికలాంగులు వచ్చినప్పుడు కూర్చోవడానికి రెండు కుర్చీలు కేటాయించాలని తెలిపారు. వికలాంగులకు అనేక కార్యక్రమాలు డిజైన్‌ చేయడం జరిగిందని వినియోగించుకోవాలని 30 నుంచి 60 శాతం సబ్సిడీ మీద ఆర్థిక సాయం చేసే విధంగా స్కీమ్స్‌ ఉండాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెల వికలాంగుల సమస్యలపై సమీక్ష నిర్వహించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, అనేక రంగాలలో ప్రభుత్వం వికలాంగులను ప్రోత్సహిస్తూ వారికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రతి స్కీమ్‌లో వారికంటూ ఒక పర్సంటేజీ కోటా ఏర్పాటు చేసిందని, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు దివ్యాంగులకు సపోర్టుగా నిలబడాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ రోజుల్లో దివ్యాంగులు చాలా రంగాలలో పోటీలలో పాల్గొనే రీతిలో ముందుకు సాగుతున్నారని, టెక్నాలజీ పెరిగిందని ఎక్కడ నిరుత్సాహం చెందకుండా ప్రతి రంగంలో ముందుకు వెళ్ళడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం నుండి సహాయం అందుతుందన్నారు.

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అకాల మృతికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సానుభూతి వ్యక్త పరుస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ నిమిషం పాటు మౌనం పాటించారు. ప్రభుత్వం వారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగిందన్నారు.

అనంతరం ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌ సూపర్వైజర్లకు, అంగన్వాడి టీచర్లకు, దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వీల్‌ చైర్స్‌, జూపిటర్‌ త్రీ వీలర్‌ బైక్‌లు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ విట్టల్‌ రావు, ఎమ్మెల్సీ విజీ గౌడ్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు లక్ష్మి, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, జడ్పిటిసి జగన్‌, గంగారెడ్డి, డిసిపి అరవింద్‌, డిపిఓ జయసుధ, డిడబ్ల్యూఓ రaాన్సీ లక్ష్మీ, సంబంధిత శాఖల అధికారులు దివ్యాంగులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »