ఆర్మూర్, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ 65వ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా దలిత మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆర్మూర్ మున్సిపాలిటి పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ కుమార్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, దళిత మోర్చ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం, దళిత మోర్చా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళీధర్ మాట్లాడారు.
అంబేద్కర్ జయంతి, వర్ధంతులను జరుపుకోవడమే కాదు వారి ఆదర్శాలను, ఆశయాలను మన జీవనపథంలో అలవాటు చేసుకున్నప్పుడే అంబేద్కర్‌కి నిజమైన నివాళులర్పించిన వారమవుతామని, కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ప్రధానంగా దళితులను అవమానపరిచే విధంగా వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ, మాయ మాటలు చెప్తూ కాలం వెళ్లదీస్తుందన్నారు.
తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి అబద్ధాలు మాట్లాడం, మోసాలు చేయడం తప్ప ఇంకేమీ చేయలేదని, ప్రధానంగా దళితుల విషయంలో తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, హైదరాబాద్‌లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా మొన్నటికి మొన్న దళితులకు దళిత బంధు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పూటకో అబద్ధం మాట్లాడుతూ దళితులను మోసం చేస్తున్నారని అందుకే ప్రతి దళిత వ్యక్తి అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ విశ్రమించకూడదని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బిజెపి సీనియర్ నాయకులు శికారి శ్రీనివాస్, దళిత మోర్చ ఆర్మూరు పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్, ప్రధాన కార్యదర్శి సుమన్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ఉపాధ్యక్షులు పెద్దోళ్ల భరత్ బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.