కామారెడ్డి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.