నిజామాబాద్, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వేలాదిమంది విద్యార్థులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. గౌతం కుమార్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం విద్యా రంగం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన విద్యార్థుల త్యాగాలు, వారి పోరాటాలను ఎగతాళి చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వ పాలన సాగుతుందని ఆరోపించారు. అందులో భాగంగానే రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు నాలుగు వేల కోట్ల రూపాయలు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు.
రియంబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోర్సులు పూర్తిచేసి పైచదువులకు వెళ్లే సమయంలో ప్రైవేటు యాజమాన్యాలు, సంస్థలు ఫీజులు పెండిరగులో ఉండడంతో సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదన్నారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారన్నారు. అప్పులు కూడా పుట్టడం లేదన్నారు. దీంతో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు చదువులు మానే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు, ఓట్లు, సీట్లపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమంపై లేదన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వానికి తీవ్ర నిర్లక్ష్య వైఖరి ఉందన్నారు. సర్కారు మొండి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని పి.డి.ఎస్.యూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగానే ఛలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామన్నారు.
ప్రభుత్వం వెంటనే ఫీజు, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నరేందర్, రాజేశ్వర్ జిల్లా నాయకులు ప్రశాంత్, ప్రత్యూష, అనిల్, సాయికృష్ణ, నిఖిల్, నగర నాయకులు అశుర్, సంగీత, సాయితేజ, మహిపాల్, వేణు, నవీన్, మౌనిక, కిషోర్, చందు, సచిన్, నరేష్, బాలాజీ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.