నిజామాబాద్, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమెరికాలోని టాల్ స్కౌట్స్ సంస్థ వారు నిర్వహించిన అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌లో తెలంగాణ మాడల్ స్కూల్ ఆర్మూర్ విద్యార్థులు బహుమతులు సాధించారు.
సోషల్ అడ్వకర్షి విభాగంలో 9వ తరగతి చదుటవుతున్న కార్తికేయ రూపొందించిన సేవ్ వాటర్ సేవ్ ఫర్‌మార్ సేవ్ అవర్ మదర్ లాండ్ అనే ప్రాజెక్టుకు రెండవ బహుమతి సాధించారు. ఈ విభాగం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పద్మశ్రీ గీత, కార్తికేయకు రీడర్ లీడర్ అవార్డును ప్రకటించారు.
అలాగే 8వ తరగతి చదువుతున్న కుందవరపు వెంగనివాస్ రూపొందించిన ఆచార్య దేవోభవ అనే ప్రాజెక్టుకు సోషల్ ఎంటర్‌పీనర్ షిప్స్ విభాగంలో ద్వితీయ బహుమతి లభించింది. ఈవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ మాడల్ స్కూల్‌లో చదువుతు బహుమతులు అందుకున్న అన్నదమ్ములను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ నర్ర రామారావు అభినందించారు.
అలాగే టాల్‌స్కౌట్స్ వ్యవస్థాపకులు జె.బి.చౌదరి, వీణా మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో సమస్యను గుర్తించి ప్రాజెక్టు రూపంలో సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపుతూ చక్కగా ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్నందుకు వారి ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కి, వైస్ ప్రిన్సిపాల్ నషీర్‌కి, గైడ్‌గా వ్యవహరించిన ఇంతియస్‌ని అభినందించారు.