నిజామాబాద్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వడ్ల కొనుగోళ్ల పేరుతో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్ల యాజమాన్యాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏ.ఐ.కె.ఎమ్.ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతూ …
Read More »Daily Archives: December 7, 2021
కోవిడ్ టీకా కేంద్రాల తనిఖీ
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్ తనిఖీలు చేశారు. జిల్లాలో 100 శాతం వాక్సినేషన్ చేయాలని తమ లక్ష్యం అది పూర్తయ్యేవరకు ప్రతి రోజు వ్యాక్సినేషన్ సెషన్స్ కొనసాగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అదేశానుసరం ఐసీడీఎస్, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ప్రత్యేక …
Read More »లోక్‌సభలో వినూత్నంగా తెరాస ఎంపీల ఆందోళన
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు నల్ల దుస్తులతో హాజరయ్యారు. రాజ్యసభ, లోక్‌సభలలో ఎంపీల నిరసన కొనసాగుతుంది. కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ లోక్ సభలో తెరాస పార్టీ సహచర ఎంపీలతో కలిసి నల్ల దుస్తులతో హాజరై ఆందోళన చేపట్టారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని …
Read More »గ్రామాల వారిగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి…
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య సిబ్బంది గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. డిసెంబర్ 15 లోగా గ్రామాల వారీగా 100 శాతం వ్యాక్సినేషన్ …
Read More »అపోహలు వీడండి… వ్యాక్సిన్ వేయించుకోండి…
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అపోహలు విడనాడి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 31, 39, 40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి అన్ని వర్గాల …
Read More »ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కళాశాల విద్యా కమిషర్
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఉన్నారు. కళాశాల ఎన్‌సిసి విద్యార్థులు వారిద్దరికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. రూసా నిధులతో కళాశాలలో నూతనంగా నిర్మిస్తున్న కమీషనర్ భవనాన్ని పరిశీలించారు. పాత భవనాన్ని పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని …
Read More »ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో మంగళవారం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రైస్ మిల్లు యజమానులతో ఒప్పందం చేసుకొని వరి …
Read More »రూ. 33 కోట్లతో అభివృద్ది పనులు
భీమ్‌గల్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం 33 కోట్లతో భీమ్‌గల్ మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలలో ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, 70 సంవత్సరాలలో 33 కోట్లు నిధులతో అభివృద్ధి పనులకు గతంలో ఎన్నడూ శంకుస్థాపన జరగలేదన్నారు. …
Read More »పాఠశాలకు రాలేదు.. సెలవు పెట్టలేదు…
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం రంగంపేట్ గ్రామంలో ఎంపిపి నారెడ్డి దశరథరెడ్డి మంగళవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ శ్యామగౌడ్‌తో కలిసి పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన విద్య అందించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు రాలేదు. సెలవు కుడా పెట్టలేదు. హాజరు పట్టిక చూసి అక్కడ వున్న టీచర్‌ను మీరు ఏంచేస్తున్నారు, ఆబ్సెంట్ లేదా లీవ్ …
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క దేశ పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఫీుభావం తెలుపుట అత్యవసరమని జిల్లా …
Read More »