నిజామాబాద్, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క దేశ పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఫీుభావం తెలుపుట అత్యవసరమని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మంగళవారం సాయుధ దళాల పతాక దినోత్సవమును జిల్లా కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తనవంతు విరాళము అందజేసి నిజామాబాద్ జిల్లాలో బోధన్ నుండి కాశీనాథ్ కాబడే, ఆర్మూర్ నుండి బదాం శ్రీనివాస్, చిట్టాపూర్ బాల్కొండ నుండి ఏర్రం నర్సయ్య, వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామం నుండి ర్యాడ మహేష్ భారత దేశరక్షణలో ప్రాణాలు అర్పించారని గుర్తుచేస్తూ వారి సేవలను కొనియాడారు.
అలాగే సైనికులకు, మాజీ సైనికులకు, మాజీ సైనిక వితంతువులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశభద్రతలో బాగంగా శత్రువుల దాడులలో అమరులై తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత దేశ ప్రజలకు రక్షణ కవచంలా ఉంటున్నారని కొనియాడారు. అలాగే జిల్లా ప్రజలు కుడా స్వచ్చందంగా తమవంతు విరాళాలను సైనిక సంక్షేమానికి అందిచాలని, జిల్లా ప్రజల నుండి సేకరించిన విరాళాలను ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలకు అందచేయడం జరుగుతుందని తెలిపారు.
దేశ రక్షణ కొరకు చేసిన త్యాగాల కన్న మించిన త్యాగం మరేదిలేదని కొనియాడారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కమీషనర్ అఫ్ పోలీస్ కార్తికేయ తనవంతు విరాళాన్ని అందజేసి వీరజవాన్ల కుటుంబాలకు, సైనికులకు, మాజీ సైనికులకు, మాజీ సైనిక వితంతువులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డి.రమేష్, కార్యాలయ సిబ్బంది యం.రమేష్ కుమార్, బదాం గంగామోహన్, ఉమేర్, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుజరాతీ మోహన్, కార్యదర్శి యం.దివాకర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు యం.సాయిరెడ్డి, అర్గనైసింగ్ కార్యదర్శి బస్వ్వరాజ్, బాలాజీ, లింగారావు, కరుణ, సుజాత, సరస్వతి, మాజీ సైనికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.