కామారెడ్డి, డిసెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం రంగంపేట్ గ్రామంలో ఎంపిపి నారెడ్డి దశరథరెడ్డి మంగళవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ శ్యామగౌడ్‌తో కలిసి పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన విద్య అందించాలని సూచించారు.
ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు రాలేదు. సెలవు కుడా పెట్టలేదు. హాజరు పట్టిక చూసి అక్కడ వున్న టీచర్‌ను మీరు ఏంచేస్తున్నారు, ఆబ్సెంట్ లేదా లీవ్ ఏదోకటి రాయాలి కదా అని అసహనం తెలిపారు. గ్రామాలలో వ్యవ్యసాయ దినసారి కూలీ 300 ఇస్తున్నారు. ఒకకూలీ గంట సేపు పనిచేయకుంటే కూలీ ఇవ్వరు. అలాంటిది లక్షల రూపాయలు ప్రభుత్వ జీతం తీసుకొని ఇలా పాఠశాలకు రాకుండ ఉంటే ఎలా అని మండిపడ్డారు.
అనంతరం గ్రామంలో పర్యటిస్తు ఒక ఇంటి ముందు దీనంగా కూర్చున్న మహిళ వివరాలు తెలుసుకున్నారు. సాకాలి విజయ, ఆమె ఇద్దరు పిల్లలు మానసిక వికలాంగులు ఆమె భర్త ఇటీవల మరణించాడు. ఒంటరి మహిళను ఓదార్చి తక్షణం 2 వేల నగదు 50 కిలోల బియ్యం తెప్పిచి అందజేశారు. వారి దీనస్థితి చూసి చుట్టుపక్కల ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. తాము కూడా అండగా ఉంటామని పిల్లల చదువులు తమవంతు సహాయం చేస్తామని సర్పంచ్ శ్యామగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షులు. ఎస్.కె. గౌస్ పాషా, తెరాస నాయకులు భూపల్లి మోషంపూర్, దత్తాద్రి, గోకులతండా లింబాద్రి, రంగంపేట్ పెద్దలు సురేందర్, యోసేఫ్ తదితరులు పాల్గొన్నారు.