నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు నల్ల దుస్తులతో హాజరయ్యారు. రాజ్యసభ, లోక్‌సభలలో ఎంపీల నిరసన కొనసాగుతుంది. కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ లోక్ సభలో తెరాస పార్టీ సహచర ఎంపీలతో కలిసి నల్ల దుస్తులతో హాజరై ఆందోళన చేపట్టారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఫ్లకార్డుల ప్రదర్శన చేశారు. దేశ రైతాంగం కోసం గత వారం రోజులుగా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి నినాదాలు చేస్తూ, తెరాస ఎంపిలు నిరసన తెలుపుతున్నారు.
రైతులపై ఎక్కుపెట్టిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం, ధాన్యం కొనుగోళ్లపై స్పష్టతను ఇవ్వడం లేదన్నారు. కేంద్ర వైఖరిని పార్లమెంటు లోపలా, బయట నిరసిస్తూ, దేశ రైతాంగానికి తెరాస ఎంపిలు మద్దతుగా నిలుస్తున్నారు.