కామారెడ్డి, డిసెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అపోహలు విడనాడి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 31, 39, 40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు.
వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని సూచించారు. వార్డుల వారీగా వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, వైద్యులు పాల్గొన్నారు.