Daily Archives: December 8, 2021

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన వరిని భారత ప్రభుత్వం ఎఫ్‌సిఐ సేకరించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో బుధవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యానికి వరి కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. …

Read More »

కరోనా రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుధవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ 100 శాతం అయ్యే విధంగా చూడాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వచ్చే అవకాశం ఉన్నందున …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సహకార, సివిల్‌ సప్లై అధికారులతో మాట్లాడారు. ఐదు రోజుల్లో దాన్యం కొనుగోలు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం …

Read More »

ఉద్యోగులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త జోనల్‌ విధానాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సెలవులో, డిప్యుటేషన్‌లో, సస్పెన్షన్‌లో లేదా ఫారిన్‌ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు గురువారం సాయంత్రం కల్లా తమ ఆప్షన్లను జిల్లా అధికారులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

పరీక్షా కేంద్రాల తనిఖీ

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఆర్మూర్‌లో డిగ్రీ 5వ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్ష కేంద్రాలు అయిన గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల, నరేంద్ర డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విసి వెంట పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య యమ్‌ అరుణ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సాయగౌడ్‌ ఉన్నారు.

Read More »

కేర్‌ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంక్‌ వారు ప్రాంగణ నియామాకాలు ఈనెల 10న శుక్రవారం ఉదయం 10 గంటల నుండి చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై 25 సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు ప్రాంగణ నియామకాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువతి యువకులకు ఇది మంచి …

Read More »

అర్హులకే రెండు పడక గదుల ఇళ్ళు

వేల్పూర్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజమైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం గృహ నిర్మాణ శాఖ వేల్పూర్‌ మండల కేంద్రంలో నిర్మించిన 112 డబల్‌ బెడ్‌ రూమ్స్‌ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ …

Read More »

తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఓ నెగెటివ్‌ రక్తనిల్వలు లేకపోవడంతో లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ రెడ్డి ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »