కామారెడ్డి, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సహకార, సివిల్ సప్లై అధికారులతో మాట్లాడారు. ఐదు రోజుల్లో దాన్యం కొనుగోలు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు ట్రాన్స్పోర్ట్ ఆర్‌లతో మాట్లాడి ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్‌లకు పంపించాలని సూచించారు. ఎక్కడైనా నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే అధికారులు తరలించే విధంగా చూడాలని ఆదేశించారు.
సహకార, సివిల్ సప్లై అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యంను లారీలలో రైస్ మిల్‌లకు తరలించే విధంగా చూడాలని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్సులో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా సహకార అధికారిని వసంత, ఆర్డిఓ శీను, సహకార సంఘాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.