నిజామాబాద్, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త జోనల్ విధానాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సెలవులో, డిప్యుటేషన్లో, సస్పెన్షన్‌లో లేదా ఫారిన్ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు గురువారం సాయంత్రం కల్లా తమ ఆప్షన్లను జిల్లా అధికారులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.