డిచ్‌పల్లి, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఆర్మూర్‌లో డిగ్రీ 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష కేంద్రాలు అయిన గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, నరేంద్ర డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విసి వెంట పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య యమ్ అరుణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయగౌడ్ ఉన్నారు.