కామారెడ్డి, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుధవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ 100 శాతం అయ్యే విధంగా చూడాలని సూచించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చే అవకాశం ఉన్నందున అర్హత గల ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయించాలని వైద్యాధికారి రవీందర్ రెడ్డికి సూచించారు. మండల స్థాయి అధికారుల సహకారం తీసుకుని వ్యాక్సినేషన్ 100 శాతం అయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు.