వేల్పూర్, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం గృహ నిర్మాణ శాఖ వేల్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన 112 డబల్ బెడ్ రూమ్స్ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ 112 ఇండ్ల కాలనీ 7 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 112 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 77 ఇండ్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎవరికైతే ఇల్లు రాలేదో వారి కోసం సర్వే చేస్తున్నారని తెలిపారు. ఇళ్ల కేటాయింపులో కేవలం పేదరికాన్ని ప్రాతిపదికగా అధికారులు ఎంపిక చేశారని కులమతాలు రాజకీయాలు కానీ తరతమ అనే బేధాలు లేవని స్పష్టం చేశారు.
వేల్పూరు గ్రామస్తులు అందరూ తన వారే అన్నారు. నిష్పక్షపాతంగా సెలక్షన్ జరిగిందన్నారు. గ్రామాలలో ప్లాట్లు, ఇల్లు రెండు లేనివారికి మొదలు ఇవ్వాలని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇంకా 35 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నవని వాటిని సెకండ్ లిస్ట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కేటాయిస్తామన్నారు. ప్రభుత్వము నుండి ఇంతకుముందు ప్లాట్లు పొందిన వారికి రూల్ ప్రకారం ఇవ్వడం కుదరదన్నారు. రెండవ స్టేజ్‌లో ఇల్లు లేని ప్లాట్లు ఉండి కట్టుకోలేని వారికి పెద్ద కుటుంబం ఉండి ఇల్లు సరిపోని వారికి ఒక్కొక్క స్టేజి ప్రకారం ఇస్తామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.
ఏడు సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు ఏమేమి చేయాలో ఆలోచన చేసి ఇస్తూ ఉన్నాం అన్నారు. రైతులకు ఎకరం భూమికే సంవత్సరానికి 10 వేలు 24 గంటలు కరెంటు, బీడీ కార్మికులకు రెండు వేల పెన్షన్, పేదలకు ఆసరా పెన్షన్ 2 వేలు, ఒక్క వేల్పూర్‌లో ఆసరా పెన్షన్‌లు 2001 మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో సొంత జాగా ఉన్నవారికి డబ్బులు ఇచ్చి కట్టుకునే స్కీమ్ రాబోతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డిసిఓ సింహాచలం, ఎస్‌ఇ, ఆర్‌అండ్‌బి రాజేశ్వర్ రెడ్డి, ఎంపిపి అధ్యక్షురాలు జమున, జెడ్‌పిటిసి కలకొండ భారతి, ఎమ్మార్వో సతీష్, సర్పంచ్ లతా మోహన్, వీడీసీ అధ్యక్షులు లబ్ధిదారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.